Nagavamshi

Nagavamshi: బన్నీ-త్రివిక్రమ్ సినిమా నుంచి క్రేజీ న్యూస్!

Nagavamshi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో ఒక బ్రాండ్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతని లైనప్ లో భారీ చిత్రాలు రాబోతున్నాయి, అందులో త్రివిక్రమ్‌తో ఒక గ్రాండ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. నిజానికి ‘పుష్ప 2’ తర్వాత ఇదే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు దీని స్థానంలో అట్లీ సినిమా వస్తుంది. అయితే, తాజాగా త్రివిక్రమ్‌ సినిమా గురించి నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని మైథాలజీ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. యావత్ భారతదేశం దీని వైపు ఆకర్షితమవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. భారతీయ ఇతిహాసాల్లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక కొత్త పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *