bigg boss telugu ratings: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలైంది. అంటే యాభై రోజులకు చేరువైంది. మరో 55 రోజులు షో జరుగబోతోంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలెట్టిన ఈ సీజన్ కు మొదటి నుండి బజ్ పెద్దంతగా లేదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ఎప్పటిలానే ఇంటర్వ్యూలు చేసి జనంలోకి వదులుతున్నా…. ఈ షో మీద ఎవరికీ ఎలాంటి ఆసక్తి కలడం లేదు. చిత్రం ఏమంటే… ఈ సీజన్ ప్రారంభమై 35 రోజులు గడవగానే గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకొచ్చారు. ఇప్పటికే ఒకసారి వాళ్ళ ఆటతీరును చూసిన వ్యూవర్స్ కు ఇది పూర్తిగా మొత్తేలా చేసింది. దాంతో రేటింగ్స్ మునుపెన్నడూ లేనంత దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. ఒకప్పుడు బిగ్ బాస్ షో 21కి పైగా టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇప్పుడు నాగార్జున కనిపించే వీకెండ్ లో కూడా అయిదు దాటి పోవడం లేదట. ఇక మామూలు రోజుల్లో అయితే… 3.5 లేదా 4 వస్తోందట. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లోకి అతి తక్కువ రేటింగ్ వచ్చింది ఇప్పడే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరో 55 రోజుల షో బ్యాలెన్స్ ఉండగా దీనిని నిర్వహకులు టీఆర్పీ పెరగడానికి ఏం చేస్తారో చూడాలి.
