Road Accident: రోడ్డు ప్రమాదాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త వల్ల వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయాలు పాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. హయత్‌నగర్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్పీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లక్ష్మారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది.
రాచకొండలో కంట్రోల్ రూమ్‌లో ఏఎస్పీ నందీశ్వర బాబ్జి పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం నాలుగు గంటలకు వాకింగ్ కోసం.. విజయవాడ జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.
Also Read: Crime News: భర్తను చంపి.. ప్రియుడితో హనీమూన్ కి వెళ్లిన భార్య
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి, అడిషనల్ ఎస్పీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డీసీపీ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ASP బాబ్జి మృతిచెందిన చోట రోడ్ వైడనింగ్ పనులు జరిగాయని.. అప్పటి నుంచే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు రెండువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రోడ్డు క్రాస్ చేయకుండా చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.

