SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా దీనిని మేకర్స్ తెరకెక్కిస్తుండగా భారీ హైప్ నెలకొంది. RRR లాంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మన దేశంలో జరుగుతుంది. అయితే ఈ షూట్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి తెలుస్తుంది.
Also Read: Samantha: ఓటీటీ ఉత్తమ నటిగా సామ్!
SSMB29: జక్కన్న ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడం ఆలస్యంగా చేసినప్పటికీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్ లో జరుగుతుందట. అంతే కాకుండా అనుకున్న సమయం కంటే షూటింగ్ కంప్లీట్ అయ్యిపోతుందట. దీనితో రెండు భాగాల షూటింగ్ కూడా ఇదే స్పీడ్ లో జరగనుందని తెలుస్తుంది. 2027 కి ఈ సినిమా మొదటి భాగాన్ని రిలీజ్ కి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.