NaraLokesh

NaraLokesh: కార్యకర్తల బాధ్యత ఇక పూర్తిగా లేకేష్‌దే!

NaraLokesh: ఏపీలో టీడీపీ కార్యకర్తలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత… పార్టీ అధిష్టానం కార్యకర్తలను గాలికి వదిలేసిందనే విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియాలో నేరుగా కొంతమంది కార్యకర్తలు… దీనిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో… కార్యకర్తలు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కలవడం లేదు.

ఇక నియోజకవర్గ స్థాయి పర్యటనలు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు సరిగా చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇన్చార్జి మంత్రులు కూడా కార్యకర్తలపై ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు సైతం వినపడుతున్నాయి. దీనితో చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కార్యకర్తలపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాజకీయంగా పార్టీ బలోపేతం కావాలంటే కచ్చితంగా కార్యకర్తల అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి బుధవారం కార్యకర్తల కోసం కేటాయించింది పార్టీ అధిష్టానం.

NaraLokesh: ఇక నుంచి ప్రతి బుధవారం కార్యకర్తల సమస్యలు వినడమే కాకుండా… వాటి పరిష్కారానికి కూడా కృషి చేయనున్నారు. 2019 నుంచి 2024 వరకు వేల మంది కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసులను ఒక్కొక్కటిగా కొట్టేస్తున్నారు. ఇక కొంతమందిపై నమోదైన కేసులు విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టడం లేదనే ఆరోపణ కూడా ఉంది. అప్పట్లో తప్పుడు కేసులు పెట్టారు అనే విమర్శలు వచ్చేవి.

Also Read: Buggana: పాపం జగనన్న.. బుగ్గన కూడానా?

వాటిని కొట్టేయకుండా కాలయాపన చేస్తున్నారనే విమర్శలు కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు. ఇప్పుడు వాటిపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంది. అవసరమైతే తీవ్రతను బట్టి న్యాయ సహాయం కూడా కార్యకర్తలకు నేరుగా అందించేందుకు సిద్ధమవుతోంది. కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని ఇకపై లోకేష్‌ స్వయంగా తన భుజాలపై వేసుకోనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *