Delhi: ఇనాక్టివ్ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్

Delhi: కేంద్ర ప్రభుత్వం ఇనాక్టివ్ ఫోన్ నెంబర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవల విషయంలో అనవసరమైన సమస్యలు, మోసాలు లేకుండా చూడటానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, ఇనాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లకు, లేదా ఇతరులకు తిరిగి కేటాయించిన నంబర్లకు, వచ్చే ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపివేయబడతాయి.

ఈ మేరకు అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకపోతే, UPI సేవలను నిలిపివేసి, మోసాలకు అవకాశం లేకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. UPI సేవలు OTP ధృవీకరణ వంటి భద్రతా చర్యలపై ఆధారపడతాయి. అయితే టెలికాం సంస్థలు కొంతకాలం వాడకంలో లేని నంబర్లను తిరిగి ఇతర వినియోగదారులకు కేటాయిస్తుంటాయి. దాంతో పాత యూజర్ల బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిన నంబర్లు దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఈ సమస్యను తగ్గించడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. Google Pay, PhonePe, Paytm వంటి ప్రముఖ UPI యాప్‌లు మరియు బ్యాంకులు, తమ సేవల్లో ఇనాక్టివ్ మొబైల్ నంబర్లను తొలగించాలని అనవసరం తప్పని విధంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నంబర్ ఇనాక్టివ్‌గా ఉండి, ఈ జాబితాలో ఉన్నట్లయితే, మీకు UPI సేవల నిలిపివేతకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటికీ నంబర్ యాక్టివ్ కాకపోతే, యూపీఐ సేవలు పూర్తిగా నిలిపివేయబడతాయి.

ఎవరిపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది?

మొబైల్ నంబర్ మార్చి బ్యాంక్ రికార్డులను అప్‌డేట్ చేయనివారిపై

UPI లింక్‌తో ఉన్న నంబర్లను ఎక్కువకాలం ఉపయోగించని వారిపై

తమ పాత మొబైల్ నంబర్‌ను సరెండర్ చేసిన వారిపై

మీ యూపీఐ సేవలు నిలిపివేయకుండా ఉండాలంటే:

మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయండి

బ్యాంక్ నుంచి వచ్చే OTPలు మరియు SMSలు అందుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించండి.

కొత్త నంబర్ ఉన్నప్పుడు వెంటనే బ్యాంక్ ఖాతాలోని మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.

నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి ఈ పనిని పూర్తి చేయవచ్చు.

ఈ చర్యలు UPI వినియోగదారుల భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *