Ap weather: అలర్ట్.. రేపు ఏపీలో వర్షం..

Ap weather: ఆంధ్రప్రదేశ్‌లో రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వెల్లడించారు.

తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్రంగా వీచే అవకాశముండటంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు

ఆదిలా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

ఉష్ణోగ్రతలు పెరుగనున్న సూచనలు

మూడు రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, ఉదయం మరియు మధ్యాహ్నపు సమయంలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రంసూచించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Public Greevens Kadapa: అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా కలెక్టర్‌ వార్నింగ్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *