Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…

అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమన్వయంతో ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు.

ఈనెల 22, 23 తేదీలలో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుందని. రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ సమ్మిట్‌ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు సదస్సు ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ సమ్మిట్‌లో వ్యవసాయ, ఆరోగ్య, లాజిస్టిక్ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డులు, డిజిటల్ లాండ్ రికార్డులు తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయని తెలిపారు.

డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ పార్క్ వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 5వేల డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షోను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ డ్రోన్ సమ్మిట్ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adurthi Subba Rao: దర్శక చక్రవర్తి... ఆదుర్తి సుబ్బారావు జయంతి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *