women health

Womens Health: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాలి..

Womens Health: పురాతన కాలం నుండి ఇంటి సభ్యుల ఆరోగ్య బాధ్యత మహిళలే చూసుకుంటూ వస్తున్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినప్పుడే వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు. వంట ఒత్తిడి, పిల్లల పెంపకం, ఇంటి పనుల మధ్య సరైన సమయానికి తినడం అవసరం. ఆహారం తీసుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 30 శాతం ప్రోటీన్లు, 20 శాతం కొవ్వు ఉండాలి. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం సరైన సమయానికి తీసుకోవాలి.

నేటి కాలంలో భారతీయ మహిళలు ప్రోటీన్, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. వారు రోజుకు 3-4 లీటర్ల నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేసవిలో ఇలాంటి సవాళ్లు ఎక్కువగా ఎదుర్కొంటారని వైద్యులు చెబుతున్నారు. మహిళలు కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా.. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Lemon Health Benefits: నిమ్మకాయ కావాలని మీ బాడీ మిమ్మల్ని అడుగుతుంది తెలుసా.. ఎలా అంటే..

ఇంటి పనిలో పాల్గొనే మహిళలు రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మహిళలు వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం, యోగాతో సహా ఏదైనా శారీరక శ్రమ చేయడం తప్పనిసరి. అన్నింటికంటే ముఖ్యంగా..వార్షిక హెల్త్ టెస్టుల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా నిరోధించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *