Shyamala: యూట్యూబర్స్ కాదు.. యూత్ కిల్లర్స్‌లా తయారయ్యారు సో కాల్డ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు. లక్షల్లో ఫాలో అయ్యే వ్యూవర్స్‌ని వాడుకుంటూ.. య్యూట్యూబ్‌ని చెత్త కంటెంట్‌తో నింపేస్తూ.. సంపాదించుకుంటున్నది చాలక.. బెట్టింగ్ యాప్స్ పేరుతో బరితెగిస్తున్నారు. ఆడండి… చావండి అంటూ అమాయకుల్ని బెట్టింగ్ యాప్స్ ముగ్గులోకి దింపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బరితెగించిన యూట్యూబర్స్ కారణంగా.. బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకుని రోజూ ఎక్కడో ఒక చోట మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుతోంది.
రాత్రికి రాత్రే లక్షల్లో కాసులు కురుస్తాయంటూ సెలబ్రిటీల ముసుగులో ఈజీ మనీ పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. ఏమైంది… ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ లాభాల కోసం కుటుంబాలను నాశనం చేస్తారా? అని ప్రశ్నిస్తే.. ఈ వింత జీవులు చెప్పే సమాధానాలు ఇంకా వింతగా ఉంటున్నాయి. దీంతో ఒక్కొక్కడి బరతం పట్టేందుకు రెడీ అయ్యారు తెలంగాణ పోలీసులు. ఏ ఒక్కరిని వదిలే పరిస్థితి లేకపోవడంతో.. ఇప్పుడిప్పుడే కొందరు సెలబ్రిటీలు కలుగు నుండి బయటకొచ్చి.. సారీ తప్పైంది.. బెట్టింగ్ ఆడొద్దు.. ప్రమోట్ చేయొద్దు అంటూ లెంపలేసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా విశాఖలో లోకల్ బాయ్ నానిని ఇటీవలే జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. ఇలా మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లాలో అందిన ఫిర్యాదుల మేరకు పలు చోట్ల కేసులు పెట్టారు.
Also Read: Pre-Arrest Bail: మద్యం స్కాం కేసులో.. హైకోర్టుకు మిథున్‌రెడ్డి
Shyamala: అయితే ఈ లిస్టులో ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న శ్యామల కూడా ఉన్నారు. ఆమె గతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ అండ లేని వారిపైనే కేసులు పెడుతున్నారు కానీ.. శ్యామల లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పట్టించుకోరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో శ్యామలపై కూడా కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఒక వేళ ఆమె.. తాను గతంలో ప్రమోట్ చేసినా.. ఇప్పుడు చేయట్లేదు కదా అని వాదించినా కుదిరేలా లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసులు నమోదైన వారిలో చాలా మంది గతంలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడం వల్లే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. మరి వైసీపీ శ్యామల పరిస్థితి ఏమౌతుందో చూడాల్సిందే.

