Panchakarla Ramesh Babu: అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో గ్రామ పండుగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తవ్వవాని పాలెం, అమృతపురం, అసకపల్లి, బాటజంగాల పాలెం, సబ్బవరం, సాయినగర్, గ్రామాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సిసి రోడ్లు, డ్రైనులు, బోర్లు స్మశాన వాటిక బౌండరీలు, షెడ్లు మరియు ఆర్డబ్ల్యూఎస్ వర్కు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఆశీస్సులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్లు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.
ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి 25 కోట్ల రూపాయలు హెచ్చించగా వీటిని సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, బోర్లు, స్మశాన వాటిక బౌండరీలు తదితర పనులకు వినియోగించడం జరుగుతుందన్నారు.ఇందుకోసం గ్రామాల్లో ఆయా పనులకు సంబంధించి శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఎవరైతే తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేస్తారో వారికి మరో 40 నుండి 50 లక్షల రూపాయలు అదనంగా నిధులు మంజూరు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ చేయలేని అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం ఐదు నెలలలో చేస్తుందంటే ఇది కేవలం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లా కృషి ఫలితమే అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.