Pothina Venkata Mahesh: పాత రాజరాజేశ్వరి పేటలో ఇల్లు ఖాళీ చేయాలని రైల్వే శాఖ చేత ఆదేశాలు చేయించిన కూటమి ప్రభుత్వం బుడమేరు వరద కారణంగా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఈ ఆదేశాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.. బాధితులకు అండగా విజయవాడ ఎంపీ చిన్ని ఉండాలి రైల్వే కి ప్రత్యేక స్థలం చూపిస్తుంటే రైల్వే అధికారులు తిరస్కరిస్తున్నారు .. దీనిపై ఎంపీ చిన్ని తక్షణం కేంద్రం తో మాట్లాడాలి రైల్వే శాఖ అధికారులు ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేటట్లు ఒప్పించాలి..రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రంతో మాట్లాడించాలి రాజరాజేశ్వరి పేటలో ఇల్లు ఖాళీ చేయాలని దండోరా వేయించడం, చేయకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారంటూ చెప్పడం సరైనది కాదు.గత జగన్ మోహన్ రెడ్డి గారు పాత రాజరాజేశ్వరి పేట ఉండే వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని భావించారు మేము పాత రాజరాజేశ్వరి పేట ప్రజల తరఫున పోరాటం చేస్తాం.. గతంలో చేసాం ఇప్పుడు కొనసాగిస్తాం.వారాలబ్బాయి సుజన చౌదరి గారికి ఇక్కడ సమస్య తెలీదు.. హైదరాబాద్ ఢిల్లీలో ఉండే వ్యక్తికి ఇక్కడ సమస్యలు తెలియదు స్థానిక నేతలకి సమస్యలు తెలుస్తాయి ప్రజలు కూడా ఆలోచించాలి పాత రాజరాజేశ్వరి పేట ప్రజలకి ఇప్పుడు మేము అండగానే ఉంటాం.
