Delhi:దేశ రాజధాని నగరంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయి కాలుష్యంతో దినదిన గండంగా బతుకీడుస్తున్నారు. గాలిలో నాణ్యత మరింతగా పడిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శీతాకాలం ప్రవేశించడంతో ప్రజలకు గండం గడిచేదెలా అనుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం మరింతగా క్షీణించడంతో ఆందోళన నెలకొన్నది.
Delhi:ఢిల్లీలో దీపావళి పండుగకు ముందే గాలిలో నాణ్యత తీవ్రంగా పడిపోయిందని గణాంకాలే చెప్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం గాలిలో నాణ్యత వేగంగా క్షీణిస్తున్నదని హెచ్చరికలు జారీ అయ్యాయి. బుధవారం నాడు గాలిలో నాణ్యత 230 ఉండగా, శుక్రవారం నాటికి 293కు పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
Delhi:ఈ మేరకు ఢిల్లీలో బాణసంచా వాడకంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది. మరోవైపు శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం మీడియా సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేయనున్నట్టు తెలిసింది. వాయు కాలుష్యం పెరుగుతుండటంపై నివాసితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.