Rajnath Singh: “గత పదేళ్లలో విమానయాన రంగం గొప్ప పురోగతి సాధించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లోని భారత వైమానిక దళానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌ను సందర్శించారు. ఆయన సమక్షంలో, ‘ఆల్ఫా టోగల్’ అనే ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన LCA-Mk. 1A యుద్ధ విమానాన్ని HALకి అప్పగించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తో సహా పలువురు అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. వ్యోమగాములకు అందించే వైద్య సదుపాయాలపై పూర్తి శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింసాకాండ..కొనసాగుతున్న ఉద్రిక్తత
భవిష్యత్తులో అంతరిక్ష వైద్యం భారీ ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు. మన దేశ విమానయాన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ విమానయాన మార్కెట్లో మన దేశం మూడవ స్థానంలో ఉంది. గత 10 సంవత్సరాలలో విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 159కి పెరిగింది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతాం అంటూ మంత్రి వివరించారు.
అంతరిక్ష వైద్యం అంతరిక్షంలో సంభవించే అనారోగ్యాలకు పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి పెడుతుందన్నారు. మన దేశంలో తయారైన అత్యంత అధునాతన యుద్ధ విమానం AMCA రూపకల్ప, అభివృద్ధిపై సలహా ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అద్భుత కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.

