3 Roses Season 2: పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బ వంటి హాట్ బ్యూటీలు కీలక పాత్రల్లో నటించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సిరీస్ సీజన్ 2 కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సీజన్ ఫస్ట్ సీజన్‌ను మించి ఉంటుందని చెబుతున్నారు. ఈ సారి నవ్వులే నవ్వులు అని అంటున్నారు. తాజాగా 3 రోజెస్ సీజన్ 2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హర్ష, ఈషా రెబ్బ, ఎస్కేఎన్ ప్రధాన పాత్రల్లో ఈ సీజన్ 2 తెరకెక్కింది.అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఎలాంటి టైం పాస్ ని అందిస్తుందో చూడాలి.

