SSMB29: సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB29’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమై, ప్రస్తుతం రెండవ దశ కోసం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి చిత్రబృందం తరలివెళ్లింది.
ఇక్కడ 12 రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, ప్రత్యేకంగా ఈ సినిమా షూటింగ్ కోసం భారత్‌కు రాబోతున్నట్లు సమాచారం.
Also Read: Face Pack: ఈ ఫేస్ ప్యాక్ జెల్ వారం వాడితే హీరోయిన్లా మెరిసిపోతారు
SSMB29: సినిమా ప్రధానంగా సాహసయాత్ర అడవుల్లో జరిగే కథ నేపథ్యంతో రూపొందనుంది. తదుపరి షెడ్యూల్‌ను కెన్యా, దక్షిణాఫ్రికాలో ప్లాన్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ‘RRR’ ద్వారా సంచలనం సృష్టించిన రాజమౌళి, ఈ సినిమాను కూడా భారీ పాన్-వరల్డ్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు టాక్.
ఇక ఏప్రిల్‌లో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. అదే సమయంలో టీజర్ విడుదల చేసి సినిమాపై మరింత క్రేజ్ పెంచాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని కె.ఎల్. నయన్ నిర్మిస్తున్నారు.