Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎ ంరేవంత్‌రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్ చేయడంపై, కులగణనపై, బీసీ వాదంపై తీన్మార్ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. చాలా రోజులుగా తనను సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ పన్నాగం పన్నాడని ఘాటుగా ఆరోపించారు.
Teenmar Mallanna: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కులగణన తప్పు అని తాను పేర్కొని పత్రాలను తగలపెడితే పార్టీ నుంచే తనను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ తల ఎత్తుకునేలా కులగణన జరగాలని తాను కోరుకున్నానని, అందుకే తనను పార్టీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సస్పెండ్ చేయించారని ఆరోపించారు.
పీసీసీకి ముందే చెప్పిన రేవంత్
Teenmar Mallanna: ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్ ఎన్నికల సభకు వెళ్లే ముందే తనను సస్పెండ్ చేయాలని పీసీసీకి సూచించినట్టు తనకు సమాచారం ఉన్నదని తీన్మార్ మల్లన్న తెలిపారు. కులగణన విషయంలో తాను చెప్పింది తప్పయితే మళ్లీ ఎందుకు సర్వే చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కులగణన సర్వేలో బీసీలను, ఎస్సీలను తక్కువ చేసి అగ్రవర్ణాలను ఎక్కువ చేసి చూపించారని ఆరోపించారు. 90 ఏండ్ల తర్వాత సర్వే చేసిన ఒక్కరు చూడా ఎందుకు హర్షించలేదని, కులగణన అసలే తప్పని తాను నిరూపిస్తా, తప్పు జరిగితే సరిదిద్దుకోండి అని సూచించారు.
కులగణన చేస్తరనే కాంగ్రెస్‌లో చేరా
Teenmar Mallanna: రేవంత్‌రెడ్డిపై నమ్మకంతో తాను కాంగ్రెస్‌లో చేరలేదని, రాహుల్‌గాంధీపై నమ్మకతోనే తాను చేరానని, కులగణన చేస్తారనే ఒకే ఒక్క కారణంతో తాను చేరానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. సీఎం పేరును మంత్రులు కూడా ఉచ్ఛరించడం లేదని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఒక న్యాయం, రాజగోపాల్‌రెడ్డికి ఒక న్యాయమా? అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకేనా? బీసీలకు లేదా? కేసీఆర్‌పై తాను ఒక్కడినే పోరాడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర ఉన్నదని, మరింత కష్టపడి ఉంటే మరో 8 సీట్లు అదనంగా వచ్చేవని తేల్చి చెప్పారు.
బీజేపీకి రేవంత్ పరోక్ష సహకారం
Teenmar Mallanna: బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు. వంశీచంద్‌రెడ్డిని ఓడగొట్టిందని మీరు కాదా? అని ప్రశ్నించారు.
ఒకే వేదికపైకి అన్ని బీసీసంఘాలు
Teenmar Mallanna: ఒకే వేదికపైకి అన్ని బీసీ సంఘాలను తెస్తామని తీన్మార్ మల్లన్న వివరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెడతమని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని చెప్పారు. శాసనమండలిలో మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న చెప్పారు. 42 శాత బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని చెప్పారు. చివరగా 2028లో తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న స్పష్టంచేశారు.

