LIon Enumeration: గుజరాత్‌లోని గిర్‌లో ఈరోజు జరిగిన జాతీయ వన్యప్రాణి మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో పరిరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ముఖ్యమైన నిర్ణయాలు – పరిశోధనలను ప్రకటించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు (NBWL) ఏడవ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
ఈ ఏడాది మే నెలలో 16వ ఆసియా సింహాల జనాభా గణనను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో, జునాగఢ్‌లో జాతీయ రిఫరెన్స్ సెంటర్-వన్యప్రాణులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే, మొదటిసారిగా, రివర్ డాల్ఫిన్ల గురించి ఒక పుస్తకాన్నిఆయన విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, SACON ఏర్పాటును కూడా మోదీ ప్రకటించారు.
Also Read: Delimitation: అర్జెంటుగా పిల్లలను కనండి.. లేకపోతే కష్టం అంటున్న ముఖ్యమంత్రి
LIon Enumeration: అంతకుముందు, ప్రధాని మోదీ గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలోని గిర్ జాతీయ ఉద్యానవనంలో లయన్ సఫారీలో పర్యటించారు. కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు.
గుజరాత్‌లో మాత్రమే కనిపించే ఆసియా సింహాలను సంరక్షించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లకు పైగా గ్రాంట్‌ను ఆమోదించింది.
ప్రస్తుతం, ఆసియా సింహాలు గుజరాత్‌లోని 9 జిల్లాల్లోని 53 తాలూకాలలో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నాయి. ఈ జాతీయ చొరవలో భాగంగా, జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాల్యలో 20.24 హెక్టార్లకు పైగా భూమిలో వన్యప్రాణుల కోసం జాతీయ సూచన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఆసియా సింహాల జనాభా అంచనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి సింహ గణన 2020లో జరిగింది.