Mumbai

Mumbai: ముంబైలో దారుణం.. తల్లి తండ్రి కళ్ళముందే నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Mumbai: ఫాస్ట్ గా వాహనం నడపడమే కాకుండా…హే నన్నే అడుగుతావా..అంటూ పిచ్చి కుక్కల్లా రెచ్చిపోయారు. ఫ్యామిలీతో వెళ్తున్న ఆ కుటుంబంపై దాడి చేయడమే కాకుండా ..ఓ ప్రాణాన్ని కూడా తీసేసారు. నడి రోడ్డుపై అందరు చూస్తూ ఉండగానే..పట్టపగలు జరిగిన ఈ సంఘటనలో ముమ్మాటికీ తప్పుడు ఆ నీచులదే. ఏ మాత్రం బాధ్యతలు విలువలు లేని వీధి కుక్కలా ఎక్కడబడితే అక్కడ తిని జీవించే ఈ నీచులు…అన్ని బాధ్యతలు తెలిసిన కుటుంబంపై దాడి చేసి ..యువకుడిని చంపేశారు..

మహారాష్ట్ర రాజధాని ముంబై లో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డు పై కొందరు దుండగులు చెలరేగిపోయారు. మంచి చెడు మరిచి విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. తల్లి తండ్రీ వారిస్తున్నా వినకుండా దాడి చేయడంతో ఆకాష్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముంబై లోని మలాడ్ రోడ్ లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఓ కారు ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. అనంతరం ఆటో డ్రైవర్ కు మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు.. కారు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ దాడిలో 28 ఏళ్ల నవ నిర్మాణ సేన కార్యకర్త ఆకాశ్ మీనన్ మరణించాడు. ఇక దాడి జరుగుతున్న సమయంలో అతని తల్లి తండ్రి పక్కనే ఉన్నారు.

ముంబైలోని మలాయ్ రోడ్ లో పుష్ప పార్క్ సమీపంలో కారు డ్రైవర్ ఆకాష్ ఓ ఆటో రిక్షాను ఓవర్టేక్ చేస్తూ ఢీ కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అనంతరం అక్కడి నుంచి ఆటో డ్రైవర్ వెళ్లిపోగా… అతనికి మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఆకాశ్ పై దాడి చేశారు. అతని తండ్రి వారిస్తున్నప్పటికీ వినకుండా దారుణంగా కొట్టారు. దాడి సమయంలో అతను తల్లి సైతం ఆకాశ్ కు అండగా నిలిచి ఏడుస్తూ తన కొడుకును కొట్టొద్దని వారించింది. అయినప్పటికీ దుండగులు వినకుండా చెలరేగి పోవడంతో తీవ్ర గాయాల పాలైన ఆకాశ్ మీనన్ అక్కడిక్కడే చనిపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆకాశ్ మీనన్ ను గట్టిగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని… వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. భారతీయ న్యాయ సంహిత కింద కేసు ఫైల్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ దాడిలో పట్టుబడిన 9 మందిని అక్టోబర్ 22 వరకు కస్టడీలో ఉంచనున్నట్టు తెలిపారు.

ALSO READ  NKR 21: అర్జున్ S/O వైజయంతి విడుదల తేదీ ఫిక్స్!

ఇక ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. నడి రోడ్డు పై ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపినప్పటికీ ఎవరూ అడ్డుకోలేదని… స్థానికులు అంతా చూస్తూ ఉండిపోయారని మండిపడుతున్నారు. మానవీయ విలువలు ఎక్కడ వరకు దిగజారిపోతున్నాయో తెలపడానికి ఈ విషయం ఓ నిదర్శనం అని… కన్నతల్లి తండ్రి ముందే కొడుకును అతి కిరాతకంగా హత్య చేయటం దారుణమని చెప్పుకొస్తున్నారు. వీడియోలు తీస్తూ నిల్చున్నారే తప్పా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *