జనాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కేటుగాళ్లు. రోజుకో చోటా పూటకో మాట చెప్పి కాలాన్ని గడిపేస్తూ జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకుందామని ప్లాన్ వేసుకుంటున్నారు. మాటలతో గారడి చేసి వారి దగ్గర కోట్లు గుంజి ఉడాయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ స్కాం బయటపడింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లోని శ్రీ సాయి కాలనీలో నివాసముండే సీతారామయ్య, అతని అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో దాదాపు 200 మందిని మోసం చేశారు. సుమారు రూ. 20కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. చింతల్ లోని ఇంటికి వచ్చి చూసే సరికి సీతారామయ్య పరారయ్యాడని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు.
బాధితులంతా సీతారామయ్య ఇంటి ముందు ధర్నాకు దిగారు. బాధితులు ఆవేదనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.తమ డబ్బు ఇప్పించాలని సైబరాబాద్ EOW లో ఫిర్యాదు చేశారు.