Viswambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో భారీ బిజినెస్ జరిగింది. ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విశ్వంభర సినిమాను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో అంత భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి సోషియో ఫాంటసీ సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. మినిమం కంటెంట్ ఉంటుంది.
Also Read: Chhaava vs Pushpa 2: పుష్ప2 ని దాటేసిన చావా..
బింబిసార సినిమాతో వశిష్ట కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. అందుకే ఈ సినిమా సైతం ఆయన అన్ని వర్గాల వారిని అలరించే విధంగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఎత్తున బిజినెస్‌కి అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు.