Viral video: 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్‌సిపి (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లు పాల్గొన్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ చేసిన ఓ పని ప్రస్తుతం వైరల్ గా మారింది.
Viral video: అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన కార్యక్రమంలో శరద్ పవార్ కోసం ప్రధాని మోదీ కుర్చీని ఉన్న కుర్చీని సర్దుబాటు చేసుకున్నారని, తద్వారా తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూసుకున్నారు. ఇది మాత్రమే కాదు, మరొక సన్నివేశంలో ప్రధాని మోదీ స్వయంగా నీటి బాటిల్ మూత తీసి గ్లాసులో నీళ్లు పోసి శరద్ పవార్‌కు అందించారు.
Also Read: KTR: రేవంత్‌రెడ్డీ.. ఆ మాటలు బంజెయ్.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
అంతే కాకుండా తన ప్రసంగం ప్రారంభంలో శరద్ పవార్ ఆహ్వానం మేరకు తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. “ఈ రోజు శరద్ పవార్ జీ ఆహ్వానం మేరకు, ఈ అద్భుతమైన సంప్రదాయంలో చేరే అవకాశం నాకు లభించింది” అని ఆయన అన్నారు.
అంతే కాకుండా కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రధాని మోదీ, శరద్ పవార్ ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారు మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మోడీ శరద్ పవార్ | మరాఠీ లిట్ ఫెస్ట్‌లో, శరద్ పవార్‌కు ప్రధాని మోదీ సంజ్ఞ