maha kumbhamela 2025

Maha Kumbhamela 2025: మహాకుంభమేళాలో మరో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

Maha Kumbhamela 2025: మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మహాకుంభ్‌లోని సెక్టార్-19లోని గురు గోరఖ్‌నాథ్ అఖాడా ముందు నిర్మించిన భక్తుల శిబిరంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనమైంది. ఆ సమయంలో పండల్‌లో దాదాపు 10 మంది ఉన్నారని చెబుతున్నారు. మంటల్లో పండల్, పరుపులు, వస్తువులు, మొబైల్స్, కొంత డబ్బు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అలెర్ట్ కావడంతో మంటలు మరింత వ్యాపించకుండా ఆపు చేయగలిగారు. 

Maha Kumbhamela 2025: ఇక ఈ రోజు మహా కుంభమేళా 40వ రోజు. జాతర ముగియడానికి ఇంకా 5 రోజులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 58 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. సంగం వెళ్ళే అన్ని రోడ్లలో 8 నుండి 10 కి.మీ. వరకు భక్తుల రద్దీ నెలకొని ఉంది. నగరం వెలుపల పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపివేస్తున్నారు. అక్కడి నుండి షటిల్ బస్సు సౌకర్యం ఉంది. అయితే, బస్సు అందుబాటులో లేకపోతే సంగం చేరుకోవడానికి దాదాపు 10 కి.మీ. నడిచి వెళ్ళాలి.

Maha Kumbhamela 2025: నిన్న అంటే గురువారం నాడు 1 కోటి 25 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. మహా కుంభ్ చివరి వారాంతం కావడంతో, ఈరోజు, శుక్రవారం నుండి మహా కుంభ్ వద్ద రద్దీ పెరుగుతుందని పరిపాలన అంచనా వేసింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానంతో ఈ జాతర ముగుస్తుంది.

రద్దీ కారణంగా, ప్రయాగ్‌రాజ్‌లోని పాఠశాలల్లో 8వ తరగతి వరకు తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి  ఫిబ్రవరి 20న ఆదేశాలు జరీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే, వచ్చే 8 రైళ్లు ఫిబ్రవరి 28 వరకు రద్దు చేశారు. 4 రైళ్ల రూట్లు మార్చారు.  నిన్న రాత్రి నుండి, భక్తులు స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో సంగం ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు.

మరోవైపు, వీఐపీల వాహనాలు ఆరైల్ ఘాట్ కు వెళ్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ (UP-70) లో నమోదు చేసుకున్న వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిస్తున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *