Girl dead body: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బాసరగుడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
