Asteroid

Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం!.. 2032లో భూమి అంతం తప్పదా?

Asteroid: శాస్త్రవేత్తలు ఇటీవల భూమికి సమీపంగా వచ్చే అవకాశమున్న ఒక పెద్ద గ్రహశకలం గురించి హెచ్చరికలు చేస్తున్నారు. ఈ గ్రహశకలాన్ని “ఆస్టరాయిడ్ 2024 YR4” అని పిలుస్తున్నారు. ఇది ఒక పెద్ద విమానం అంతా ఉండే పరిమాణంలో ఉండొచ్చు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, 2032 లో ఇది భూమికి చాలా దగ్గరగా ప్రయాణించనుంది అంటున్నారు 

ఇది భూమిని ఢీకొడుతుందా?

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం 2% మాత్రమే. అంటే 98% చాన్స్ ఇది భూమిని ఢీకొట్టకుండా దూరంగా వెళ్లిపోవచ్చు. కానీ గ్రహశకలాల మార్గం ఎప్పటికప్పుడు మారొచ్చు. అందుకే శాస్త్రవేత్తలు దీని కదలికలను పరిశీలిస్తున్నారు.

ఎలాంటి ప్రమాదం ఉందీ?

ఈ గ్రహశకలం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే, దాని వేగం గంటకు 38,000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఇది మన వాతావరణంతో తాకి పేలిపోతే, దాని శక్తి 8 మిలియన్ టన్నుల TNT పేలుడు శక్తికి సమానం, అంటే హిరోషిమా అణు బాంబు కంటే 500 రెట్లు ఎక్కువ.

  • ఈ పేలుడు 50 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయగలదు.
  • ప్రధానంగా ఆఫ్రికా మరియు దక్షిణాసియా ఈ ప్రమాదానికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది.
  • భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, కొలంబియా, ఈక్వెడార్, సూడాన్ వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశముంది.

దీన్ని ఎలా ఎదుర్కొంటారు?

ఈ గ్రహశకలం భూమికి ముప్పు కలిగించుతుందా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పలేం. మార్చి 2025 లో టెలిస్కోప్ల సహాయంతో NASA మరియు ESA దీన్ని మరింత పరిశీలించనున్నాయి.

  • 2028 నాటికి శాస్త్రవేత్తలు దీని మార్గాన్ని స్పష్టంగా అంచనా వేయగలరు.
  • గ్రహశకలాన్ని భూమిని ఢీకొట్టకుండా దారి మళ్లించేందుకు “ప్లానెటరీ డిఫెన్స్ మిషన్” వంటి యోచనలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా?

ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని కచ్చితంగా గమనిస్తూ ఉంచి, ఏదైనా ప్రమాదం ఉంటే ముందస్తుగా నివారించే మార్గాలను పరిశీలిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Donald Trump: మాతో తలపడితే అంతే: బ్రిక్స్ దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *