Amaravathi: రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా పేరు పెడుతూ ప్రభుత్వ నిర్ణయం ఈమేరకు ఎక్స్ లో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రతన్ టాటాకు నివాళిగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఇన్నోవేషన్ హబ్ కు ఆయన పేరు పెడుతున్నట్టు ట్వీట్ స్టార్టప్ లకు మెంటార్ గా వ్యవహరించనున్న ఇన్నోవేషన్ హబ్ పెట్టుబడుల ప్రోత్సాహక ఎకో సిస్టమ్ ను కల్పిస్తుందని స్పష్టం రాష్ట్రంలోని ఇతర ఐదు జోనల్ కేంద్రాలకు అనుసంధానంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంటుందని వెల్లడి ప్రముఖ వాణిజ్య సంస్థలు, గ్రూప్ ల పర్యవేక్షణలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆయా రంగాల్లో సాంకేతికత, నైపుణ్యాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన సీఎం.
