NRI Dudala Venkat

NRI Dudala Venkat: పేదింటి బిడ్డ డాక్టర్‌ కలకు ఎన్‌ఆర్‌ఐ అండ

NRI Dudala Venkat: కేటీఆర్ స్ఫూర్తితో పేద విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు ఎన్ఆర్ఐ దూడల వెంకట్. ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ మొదటి ఏడాది ఫీజుకు సంబంధించిన చెక్కును కేటీఆర్ ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ తాలూకా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన పేద విద్యార్థిని బి గౌరీకి మెడిసిన్ లో సీటు వచ్చింది. ఐతే నిరుపేద కుటుంబం కావటంతో చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితి ఆ కుటుంబ సభ్యులది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.

NRI Dudala Venkat:  తక్షణమే స్పందించిన కేటీఆర్ గౌరీ చదువు పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఐతే కేటీఆర్ స్ఫూర్తితో ఆ పేద విద్యార్థిని చదువుకు తన వంతు సాయం అందిచాలని అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ దూడల వెంకట్ ముందుకు వచ్చారు. తన జన్మదినం సందర్భంగా మొదటి సంవత్సరం ఫీజును తాను అందిస్తానని కేటీఆర్ కు మాట ఇచ్చారు.

NRI Dudala Venkat:  ఇచ్చిన మాట ప్రకారం దూడల వెంకట్ తన కుటుంబ సభ్యుల ద్వారా నందినగర్ లో కేటీఆర్ ఆధ్యర్యంలో గౌరి కుటుంబానికి మొదటి సంవత్సరం ఫీజుకు సంబంధించిన రూ. 1,65, 000 చెక్ ను అందజేశారు. చెక్కును అందించేందుకు వెంకట్ తండ్రి దూడల రవీందర్ తమ సొంతూరు ఆలేరు మండల కేంద్రం నుంచి హైదరాబాద్ లోని నందినగర్ లో కేటీఆర్ నివాసానికి వచ్చారు.

NRI Dudala Venkat:  ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వెంకట్ ను ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా విద్యార్థిని గౌరీతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. గౌరీ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెడికల్ సీటు సాధించిన గౌరీని కేటీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. గురుకుల స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశానని గౌరీ చెప్పటంతో కేటీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

NRI Dudala Venkat:  వ్యవసాయ కూలీగా పనిచేస్తూ గౌరీ ని చదివించేందుకు ఆమె తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. కూతురు చదువుకోసం ఇంతగా కష్టపడుతున్న మీరు ఎంతో మంది ఆదర్శంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా తన చదువుకు అండగా నిలిచిన కేటీఆర్ తో పాటు ఎన్ఆర్ఐ దూడల వెంకట్ కు గౌరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ  Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దారుణం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *