Konda Surekha: మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్రమంత్రి కొండ సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు, అనంతరం ఆలయ పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

