Jagital:

Jagital: మ‌రొకరి ప్రాణాలు కాపాడ‌బోయిన మ‌హిళా ఎస్ఐ దుర్మ‌ర‌ణం

Jagital:ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్ఐ దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న‌ది. మ‌రొక‌రి ప్రాణాల‌ను కాపాడ‌బోయిన ఆమె.. త‌న‌ ప్రాణాలనే బ‌లి తీసుకున్న‌ది. ఆమె మృతి వార్త‌తో ఆమె స్వ‌గ్రామంతోపాటు ఆమె ఎస్ఐగా ప‌నిచేసిన ప్రాంతాల ప్ర‌జ‌లు విషాదంలో మ‌నిగిపోయారు.

Jagital:మ‌హిళా ఎస్ఐ శ్వేత జిల్లా పోలీస్ హెడ్ క్వార్ట‌ర్‌లో ప‌నిచేస్తున్నారు. ఆమె గ‌తంలో వెల్గ‌టూరు, క‌థ‌లాపూర్, పెగ‌డ‌ప‌ల్లి, కోరుట్లలో ఎస్ఐగా విధులు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఆమె ధ‌ర్మారం నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి కారులో వెళ్తున్న‌ది. గొల్ల‌ప‌ల్లి మండ‌లం చిల్వ కోడూరు వ‌ద్దకు కారు రాగానే కారు న‌డుపుతున్న శ్వేత‌ ఎదురుగా వ‌చ్చిన బైక్‌ను త‌ప్పించ‌బోయి చెట్టును బ‌లంగా ఢీకొట్టింది.

Jagital:ఈ ప్ర‌మాదంలో శ్వేత అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఆమెతో పాటు మ‌రొక‌రు కూడా ఈ ప్ర‌మాదం చ‌నిపోయి ఉంటార‌ని తెలుస్తున్న‌ది. సెల్ఫ్ డ్రైవింగ్‌లో ఉన్న ఆమె ఎదురుగా బైక్‌పై వ‌చ్చిన వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడ‌బోయిన ఆమె.. చెట్టుకు ఢీకొన‌డంతో ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని స్థానికులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *