Rope Car Project: జమ్మూ కాశ్మీర్‌లోని అమర్నాథ్(Amarnath Temple) గుహ దేవాలయం నుంచి కేరళలోని శబరిమల వరకు దేశవ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ‘రోప్ కార్'(Rope Car Project) పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నేతృత్వంలోని ‘పర్వత్మల పరియోజన’ కింద ఈ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం, జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయం, శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం పనులు జరుగుతున్నాయి.
దీని ప్రకారం జమ్మూకశ్మీర్‌లోని పల్దల్ ప్రాంతం నుంచి అమర్నాథ్ ఆలయానికి 11.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురత్కు రోప్‌కార్ సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించారు.
కేరళలోని శబరిమల అయ్యప్పన్ దేవాలయం వద్ద కూడా 2.62 కి.మీ దూరం రోప్ కార్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.
తమిళనాడులోని పర్వతమలై, కాశ్మీర్‌లోని తజివాస్ గ్లేసియర్, రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అమర్‌కోట్, ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన మహారాష్ట్రలోని శివనేరి ఫోర్ట్ సహా 18 ప్రాంతాల్లో రోప్ కార్ సర్వీసును ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Almonds: మీకు ఈ సమస్యలుంటే బాదం అస్సలు తినొద్దు..

