uttarakhand:ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర హిందూ ఆలయాలను మంచు కారణంగా శీతాకాలంలో మూసి ఉంచుతారు. మళ్లీ శీతాకాలం అనంతరం వాటిని తెరుస్తారు. అలాంటి వాటిలోని ప్రధానమైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల మూసివేత తేదీలను ఆలయాల కమిటీలు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే ఈ ఏడాది ఈ ఆలయాలను లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ రెండు నెలల కాలంలోనే అత్యధిక సంఖ్యలో దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది బద్రీనాథ్ ఆలయాన్ని 11 లక్షల మంది, కేదార్‌నాథ్ ఆలయాన్ని 13.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
uttarakhand:బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను నవంబర్ 17న, నవంబర్ 3వ తేదీన గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులను మూసి వేయనున్నట్టు ఆయా ఆలయాల కమిటీలు ప్రకటించాయి. దీంతో ఆయా ఆలయాల తలుపులను పూర్తిగా మూసి వేస్తారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి. భక్తుల దర్శనానికి అక్కడ అనుకూలతలు ఉండవు. ఆలయాలను మూసివేసే నాటికి లక్షలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికీ భక్తుల రాక కొనసాగుతుందని ఆలయ కమిటీలు తెలిపాయి.