TGPSC Group 1: తెలంగాణలో ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన కమిషన్ ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. 563 పోస్టులకు గాను ప్రిలిమ్స్ నుంచి 31,382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మొత్తం 7 సబ్జెక్టుల పేపర్లు ఉంటాయి. సంస్థ వెబ్‌సైట్‌లో సోమవారం నుంచి అందుబాటులో ఉండే హాల్‌టికెట్లను అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ అధికారులు సూచించారు.
TGPSC Group 1: ఈ నెల 27 వరకు జరిగే ఈ పరీక్షలు మధ్యాహ్నం 2:00 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో లోనికి అనుమతించరు. తొలి పరీక్ష నుంచి చివరి పరీక్ష వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలని డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం కుదరదని కమిషన్ స్పష్టం చేసింది. సమయం కోసం పరీక్ష హాళ్లలో గోడ గడియారాలను ఉంచనున్నట్టు తెలిపింది.
TGPSC Group 1: పరీక్ష కేంద్రంలోనికి హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, ప్రభుత్వ ఉద్యోగి అయితే గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తెచ్చుకోవాలని పేర్కొన్నది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య వస్తే వెంటనే సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.