minister phone stolen

Minister Phone Stolen: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా మంత్రి ఫోన్ కొట్టేశాడు..

Minister Phone Stolen: బరేలీ నుంచి లక్నోకు ఏ1 కోచ్‌లో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. మొబైల్ ఫోన్ చోరీకి గురికావడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రైలులోనే నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని జైలుకు పంపారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు నిందితుల నుంచి మంత్రి మొబైల్‌తో పాటు మరో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యంగా ఉత్తర భారతంలో రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా రైళ్లలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అందరూ సొంత వాహనంపై కాకుండా రైలుపైనే ఆధారపడుతున్నారు. అలాగే, రైలులో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ మొబైల్ ఫోన్ దొంగలించారు. 

ఇది కూడా చదవండి: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Minister Phone Stolen: A1 కోచ్‌లో బరేలీ నుండి లక్నోకు వెళుతుండగా, మొబైల్ ఫోన్ చోరీకి గురైనట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రైలులోనే నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని జైలుకు పంపారు.

పోలీసులు అందించిన సమాచారం మేరకు నిందితుల నుంచి మంత్రి మొబైల్‌తో పాటు మరో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన వెంటనే ఆర్పీఎఫ్, జీఆర్పీలకు సమాచారం అందించారు. దీనిపై విచారణకు 4 బృందాలను నియమించారు. షాజహాన్‌పూర్ , లక్నో మధ్య నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడిని నైనిటాల్‌లోని వనభూల్‌పూర్ ప్రాంతంలోని గోజాజలి నివాసి సాహిల్‌గా గుర్తించారు. షాజన్‌పూర్ జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *