Jatadhara: సుధీర్ బాబు కథానాయకుడుగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో జటాధర చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనిని తన మిత్రులతో కలిసి ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోవడానికి జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గురించి జీ స్టూడియోస్ సీఈవో ఉమేశ్ కె.ఆర్. బన్సాల్ మాట్లాడుతూ, `అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుందని, అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నార’ని అన్నారు. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ప్రస్తుతం మేకోవర్ అవుతున్నారు. ఫిబ్రవరిలో ‘జటాధర’ చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమౌతున్న సుధీర్ బాబును ఈ సినిమ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

