Uttarakhand: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code – UCC) అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ప్రత్యేక గుర్తింపును పొందింది.
చట్టం ఆమోదం: 2023 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లుకు ఆమోదం లభించింది.2024 మార్చి 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఆ మరుసటి రోజు, మార్చి 12న నోటిఫికేషన్ విడుదలైంది.2024 జనవరి నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీని అమలును సులభతరం చేయడానికి ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు.
ఈ చట్టం ముఖ్యంగా మహిళల మరియు పిల్లల సాధికారతపై దృష్టి పెట్టి రూపొందించబడిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.ప్రతి సంవత్సరం జనవరి 27ను “యూసీసీ డే”గా జరుపుకుంటామని సీఎం ప్రకటించారు.
గోవాతో పోలిక:
గోవాలో పోర్చుగీస్ పాలన నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉండగా, భారతదేశంలో చట్టబద్ధంగా UCCని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.ఇది సమానత్వం, న్యాయం, మరియు ఐక్యతను ప్రోత్సహించే ప్రధాన చర్యగా ప్రశంసించబడుతోంది.