Tilak Varma: భారత యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లాండుతో చెన్నైలో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో తన విరోచీత పర్ఫార్మెన్స్ తో టీమ్ ఇండియాని విజయతీరాలకు చేర్చిన తిలక్ వర్మ… తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఇప్పుడు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
టీమిండియా స్టార్ టి20 బ్యాటర్ తిలక్ వర్మ ఈ మధ్యకాలంలో ఉన్న ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలు బాదిన తిలక్ వర్మ… ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా సత్తా చాటుతున్నాడు. మొదటి టీ20 మ్యాచ్ లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ… రెండవ మ్యాచ్ లో మరొకసారి 72 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Tilak Varma: ఇక అతను సాధించిన రికార్డు విషయానికి వస్తే… టి20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అవుట్ కాకుండా ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా వర్మ రికార్డు సృష్టించాడు. గత నాలుగు మ్యాచ్లలో అతను 107, 120, 19, 72 పరుగులను వరుసగా చేసి ఒక్క మ్యాచ్ లో కూడా అవుట్ కాకపోవడం గమనార్హం.
హైదరాబాద్ కు చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మ… ఇలా ఇంటర్నేషనల్ టీ20 చరిత్రలో… క్రీజ్ నుండి నిష్క్రమించకుండా 300కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక రేపు జరుగబోయే మూడో టి20 లో కూడా వర్మ అవుట్ కాకపోతే ఈ రికార్డు మరింత పటిష్టమవుతుంది.
Tilak Varma: ఈ సిరీస్ ముందు కూడా అతను టి20 అంతర్జాతీయ మ్యాచ్లలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పే అవకాశం ముంగిట నిలిచాడు. అయితే మొదటి టీ20 లో ఇంగ్లాండ్ చాలా తక్కువ పరుగులు చేయడం… ఓపెనర్లు మొదటి వికెట్ కు ఎక్కువ భాగస్వామ్యం ఇవ్వడంతో వర్మకు ఆ రికార్డు నెలకొల్పే అవకాశం రాలేదు. కానీ అనుకోకుండా అతను ఈ రికార్డు సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమే.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ..! ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అనుమానమే
ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుటాడు తిలక్ వర్మ. తనకు మాత్రమే సొంతమైన టెక్నిక్, మేటి బౌలర్లను కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనగలిగే సత్తా, మైదానం నలవైపులా పరుగులు చేసే నైపుణ్యం ఉన్న తిలక్ వర్మ మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డుల బద్దలు కొడతాడో వేచి చూడాలి.

