Dil Raju: ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇంటిలో నాలుగో రోజైన శుక్రవారం కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన సోదాల్లో ఆయన ఇంటి నుంచి కీలక డాక్యమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సతీమణి పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను కూడా తెరిపించి పరిశీలించిన అధికారులు కీలక ఆధారాలను సేకరించారు.
Dil Raju: ఈ మేరకు దిల్‌రాజును ఇదేరోజు సాగర్ సొసైటీలోని ఆయన నిర్మాణ సంస్థ అయిన శ్రీవేంటకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) కార్యాలయానికి ఐటీ అధికారుల బృందం తీసుకెళ్లింది. అనంతరం ఎస్‌వీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇంటిలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లతో ఎస్‌వీసీ కార్యాలయ డాక్యుమెంట్లతో పోల్చుతూ పరిశీలిస్తున్నారు.
Dil Raju: దిల్‌రాజు నిర్మించిన సినిమాలైన గేమ్‌చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఆయా చిత్రాలకు ఆయన భారీ ఎత్తున నిర్మాణ ఖర్చులు చేసినట్టు బహిరంగంగానే చెప్పుకోవడం గమనార్హం. వాటి కలెక్షన్ల పరంగా కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినట్టు తెలిసింది. ఆయా ఆదాయ, వ్యయాల విషయాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Dil Raju: అదే విధంగా 2021 నుంచి ఇప్పటి వరకూ దిల్ రాజు, ఆయన సంస్థ ఆదాయ వివరాలను ఐటీ అధికారుల బృందం కూలంకశంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. వచ్చిన ఆదాయం, ఐటీ చెల్లింపులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. మైత్రి, మ్యాంగో, ఇతర నిర్మాతల ఇండ్లు, కార్యాలయాల్లో మూడు రోజులపాటు తనిఖీలు చేసిన ఐటీ అధికారులు నాలుగో రోజు మాత్రం దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనే తనిఖీలు చేపట్టడం గమనార్హం.

