AP Crime

AP Crime: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలుడిపై బాలిక తండ్రి దాడి

AP Crime: ఆదివారం ఆదివారం అక్కడికి వెళ్తారు. ఓ యేసు నాదా..నన్ను క్షమించు , నా పాపాలను కడిగేయుఁ అని ప్రార్థనలు చేస్తారు. కాని అక్కడే ఓ ప్రేమ పుట్టింది. దేవుడిపై కాదు , ప్రార్థనకు వచ్చే ఓ అమ్మాయిపై. ప్రార్థన కన్నా…తన ప్రేయసి IMP అనుకుని..,బాగానే ట్రై చేసాడు. కాని నో యూస్. ప్రేమ ఏమి లేదు పో అన్నది ఆ అమ్మాయి . అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేసాడు . చివరకు ఇదిగో ఇలా జరిగింది …

అంబేడ్కర్ కోన‌సీమ జిల్లాల్లో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతోన్న బాలిక‌ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలుడిపై బాలిక తండ్రి బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ముమ్మిడివ‌రం పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం, ముమ్మిడివ‌రంలో ఒక ప్రభుత్వ బాలిక‌ల ఉన్నత పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న ఓ బాలిక‌ను, ఆ పాఠ‌శాల‌కు ఎదురుగా ఉన్న బాలుర ఉన్నత పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న బాలుడు ప‌రిచ‌యం చేసుకున్నాడు. బాలిక త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చికి వెళ్తున్న స‌మ‌యంలో ప‌రిచ‌యం పెరిగింది. ఇలా త‌ర‌చూ బాలిక‌తో బాలుడు మాట్లాడేవాడు.

కొన్ని రోజులుగా బాలిక‌ను బాలుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, అతడి తల్లిదండ్రులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేశారు. దీంతో వారు బాలుడిని మంద‌లించారు. పెద్దల స‌మక్షంలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయిన‌ప్పటికీ ఆ బాలుడి తీరులో మార్పు రాలేదని, మంగ‌ళ‌వారం కూడా వేధించాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో బాలిక తండ్రి కోపానికి లోనై బాలుడిపై దాడి చేశాడు.

బాలుడు ముమ్మిడివ‌రంలోని బేక‌రి వ‌ద్ద స్నాక్స్ కొనుగోలు చేస్తుండ‌గా బాలిక తండ్రి వ‌చ్చి బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్ర ర‌క్తస్రావంతో బాలుడు కేక‌లు పెట్టాడు. దీంతో స్థానికులు చుట్టుముట్టారు. గాయాల‌తో విల‌విలాడుతున్న బాలుడిని ముమ్మిడివ‌రం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ వైద్యం అందిస్తున్నారు. దాడి చేసిన బాలిక తండ్రి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. జ‌రిగిన విష‌యం మొత్తం పోలీసులు వివ‌రించాడు. బాలుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ముమ్మిడివ‌రం సీఐ ఎం.మోహ‌న్‌కుమార్, స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ జీబీ స్వామి ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, విచార‌ణ జ‌రుగుతోంద‌ని తెలిపారు.

బాలిక‌పై అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించిన బాలుడిపై పోక్సో కేసు న‌మోదు అయింది. ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా పెద‌వేగి మండ‌లంలో చోటు చేసుకుంది. పెద‌వేగి ఎస్ఐ రామ‌కృష్ణ తెలిపిన వివ‌రాల ప్రకారం పెద‌వేగి మండ‌లంలోని ఓ ఉన్నత పాఠ‌శాల‌లో బాలుడు, బాలిక 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. అయితే బాలిక ప‌ట్ల బాలుడు అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తిస్తున్నాడు. దీంతో బాలిక పాఠ‌శాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *