ED: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరుకానున్న దృష్ట్యా ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌ను విచారించింది. మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నది. ఫెమా నిబంధనలను అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలేలా చేశారన్నది ఈడీ వద్ద ప్రధాన ఆభియోగం. ఈ కేసులో కేటీఆర్‌పై ఫెమా ఉల్లంఘనతోపాటు మనీలాండరింగ్ కేసు కూడా ఉన్నది.
ED: ఈ కేసులో మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 10కి సంబంధించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, రిజర్వ్‌బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఈవో కంపెనీకి ఆ సొమ్మును ఇప్పించారని ఏసీబీ తన కేసులో తెలిపింది. ప్రధానంగా కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు కానీ, మంత్రి మండలి ఆమోదం పొందలేదన్నది ఆరోపణ.
ఇప్పటికే అధికారులైన అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నది. ఈ నెల 9న విచారణకు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను ఈడీ పిలిచింది. అయితే ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించని కారణంగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినందున సంక్రాంతి తర్వాత ఈడీ విచారణకు పిలిచింది.

