KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనున్నది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బేల ఎం త్రివేది, ప్రసన్న వర్లె ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్‌ను నేడు విచారించనున్నది.
KTR: ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ముందు ఆయనను విచారించిన ఏసీబీ మళ్లీ విచారణకు పిలుస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో వెలువడే తీర్పుపై ఏసీబీ పిలుపు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.