Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ల పొత్తు బట్టబయలు అవుతుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే బీజేపీ నుంచి సమాధానం వస్తుంది. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం నడుస్తోంది అని అయన అన్నారు.
నిజానికి ఢిల్లీలోని సీలంపూర్‌లో సోమవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఢిల్లీని క్లీన్ చేస్తానని, అవినీతిని అంతం చేస్తానని, దేశ రాజధాని ని పారిస్‌లాగా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ చెబుతుండేవారు. ఏం జరిగింది? అవినీతిని అంతం చేశాడా? ఢిల్లీలో కాలుష్యం, అవినీతి, ఇంకా పెరిగిపోతున్నాయి అని రాహుల్ గాంధీ చెప్పారు.
రాహుల్ గాంధీ వాక్యాలకు కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్‌పై బదులిచ్చారు- రాహుల్ గాంధీ జీ ఢిల్లీకి వచ్చారు. అతను నన్ను చాలా దుర్భాషలాడాడు, కానీ అతని ప్రకటనలపై నేను వ్యాఖ్యానించను. వారి పోరాటం కాంగ్రెస్‌ను కాపాడేందుకు, నా పోరాటం దేశాన్ని కాపాడేందుకు అని పేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Bullet Bike: బుల్లెట్ బైక్ అమ్మేశారని బాలుడు ఆత్మహత్య..
కేజ్రీవాల్‌పై స్పందిస్తూ, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఇలా రాశారు – ‘తర్వాత దేశం గురించి చింతించండి, ముందు న్యూఢిల్లీ సీటును కాపాడుకోండి’. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ మాజీ సీఎంల కుమారులే.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘చాలా బాగుంది. నేను రాహుల్ గాంధీ గురించి ఒక లైన్ రాశాను బీజేపీ నుండి సమాధానం వచ్చింది. బీజేపీ ఎంత ఆందోళన చెందుతోందో చూడండి. ఈ ఢిల్లీ ఎన్నికలు బహుశా కాంగ్రెస్ ,బీజేపీ మధ్య సంవత్సరాల నాటి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తున్నాయి అని రాశారు.