Bullet Bike: చెడ్డవాళ్లతో సహవాసం మానుకోవాలని బైక్ అమ్మేశానన్న కోపంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి, అన్నయ్య తన బైక్‌ను అమ్మేశారని పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తల్లితండ్రులందరూ తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, అందరి తల్లిదండ్రుల్లాగే ఈ తల్లితండ్రులు కూడా తన కొడుకు దారితప్పడం చూడలేక ఎంతో ప్రేమగా ఇచ్చిన బుల్లెట్ బైక్‌ని అమ్మేశారు. మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి, అన్నయ్య తన బైక్‌ను అమ్మేశారని పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సుగా పనిచేస్తున్న బాలుడి తల్లి జనవరి 12, శనివారం రాత్రి 8 గంటల సమయంలో తన పెద్ద కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది, ఆమె వచ్చేసరికి చిన్న కొడుకు ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela 2025: నీటిలోనూ నిఘా.. డ్రోన్ టెక్నాలజీతో మాహా కుంభమేళాలో అద్భుతాలు!
Bullet Bike: కాసేపటి తర్వాత తన గదిలోకి వెళ్లి పిస్టల్‌తో కాల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు గది కిటికీని పగులగొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు, బాలుడు మరణం తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో అని గూగుల్ యూట్యూబ్‌లో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినట్టు తెలిసింది. బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుటుంబం ఆరు నెలల క్రితం అపెక్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి మీరట్‌కు వెళ్లింది. ఏడాది క్రితం అనారోగ్యంతో భర్తను కోల్పోయిన ఓ తల్లి తన ఇద్దరు కుమారులను ఒంటరిగా పోషించలేక ఇబ్బందులు పడింది.
ఘటనా స్థలం నుంచి పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తల్లి పలుమార్లు మందలించిందని, స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిందని తెలిపారు. చెడ్డవాళ్లతో సహవాసం చేయడం ఇష్టంలేక బైక్ అమ్మేశాడు.
పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు మీరట్ రూరల్ ఎస్పీ రాకేష్ కుమార్ తెలిపారు. కుటుంబసభ్యులు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు