Sreemukhi Apology: ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి రామభక్తులకు క్షమాపణలు చెప్పింది. ఇటీవల జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్ లో ఆమె రామలక్ష్మణులు ఊహాజనిత పాత్రలని చెప్పింది. ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మన కళ్ళ ముందున్న రామలక్ష్మణులు అని వారితో పోల్చింది. అయితే… ఈ పోలిక సంగతి ఎలా ఉన్నా చారిత్రక పురుషులు రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ గా ఎలా చెబుతావంటూ నెటిజన్స్ ఆమెపై మాటల దాడి చేశారు. మరికొందరు కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ వివాదం ముదిరి పాకనపడకముందే… శ్రీముఖి తన తప్పును గ్రహించి, బహిరంగ క్షమాణఫలు తెలిపింది. తన కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే పెద్దమనుసుతో క్షమించమని కోరింది. తానూ హిందువునేనని, రాముడిని అమితంగా నమ్ముతానని ఆమె తెలిపింది.
రామ భక్తులకు #Sreemukhi క్షమాపణలు#SankranthikiVasthunam ఈవెంట్లో రామ, లక్ష్మణులు ఫిక్షనల్ అనడంపై విమర్శలు రావడంతో స్పందించిన శ్రీముఖి pic.twitter.com/re5CE6DdWO
— Ramesh Pammy (@rameshpammy) January 8, 2025