Tesla Cyber Truck

Tesla Cyber Truck: డొనాల్డ్ ట్రంప్ హోటల్ ముందు పేలిన టెస్లా సైబర్‌ట్రక్..

Tesla Cyber Truck: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ ముందు టెస్లా సైబర్ ట్రక్ పేలిపోయింది. ఈ ఘటనలో ఒక్కరు అక్కడికి అక్కడే మృతి చెందగా పలువురికిగాయాలు అయాయి. ఇది ఉగ్ర దాడిగా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలోని నెవాడాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్ హోటల్ ముందు టెస్లా సైబర్ ట్రక్ పేలిపోయింది. మంటలు చెలరేగడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హోటల్ గేటు వద్ద ఆగి ఉన్న టెస్లా సైబర్ ట్రక్ ఒక్కసారిగా పేలడం వెనుక కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: USA: న్యూ ఓర్లీన్స్ ఐఎస్ ఉగ్రవాది దాడి.. 15 మంది మృతి

Tesla Cyber Truck: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇది తీవ్రవాద దాడి కావచ్చునని అనుమానిస్తున్నారు. టెస్లా యొక్క టాప్ మేనేజ్‌మెంట్ బృందం దీనిని చురుకుగా పరిశీలిస్తోంది. ఇంతలో, అమెరికాలోని సెంట్రల్ న్యూ ఓర్లీన్స్‌లోని బోర్బన్ స్ట్రీట్ ఐబెర్‌విల్లే కూడలిలో వేగంగా వస్తున్న ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లడంతో 15 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. విచారణలో అది ఉగ్రవాదుల దాడి అని తేలింది.


దీనికి, ‘మేం హింసను సహించము. మన దేశంలో క్రైమ్ రేట్ గతంలో ఎవరూ చూడని స్థాయిలో ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ అన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Runamafi: తెలంగాణ రైతులకు సంతోషకర వార్త.. రేపు ఒక్కొక్కరి అకౌంట్లో రూ.2,00,000లు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *