హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార నాగర్లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
దసరా సెలవులకు భార్య పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు మాల్యాద్రిని ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది.
తాగిన మత్తులో పరస్పర వివాదం జరిగి హత్య జరిగిందా, లేదా ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

