New year: ఇక్కడి ప్రజలు అప్పుడే కొత్త సంవత్సరం జరుపుకున్నారు..

New year: కొత్త సంవత్సర వేడుకలకు యావత్ ప్రపంచం సిద్ధమైంది. మన దేశంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. 2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి.

మన కాలమానం ప్రకారం సాయంత్రం 3:45 గంటలకు న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాలో మనకంటే ఐదు గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

రేపు ఉదయం మనకు 10:30 గంటల సమయం అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న… పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sunita Williams: సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకురావడానికి రాకెట్ వెళ్లిందోచ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *