Rice Mafia; రైస్ మాఫియా.. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలను దోచేసుకుంది. ఈ విషయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాకా మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ గా తీసుకున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యాన్ని నిలువరించడమే కాకుండా.. బియ్యం అక్రమ ఎగుమతి దారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చాలావరకూ బియ్యం అక్రమ ఎగుమతులను అప్పట్లో అడ్డుకోగలిగారు. అప్పట్లో అక్రమ బియ్యం వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో మహా న్యూస్ కూడా గట్టిగా బియ్యం మాఫియా పై వరుస కథనాలతో విరుచుకు పడింది. ఈ నేపథ్యంలో అక్రమ వ్యాపారులు కాస్త వెనుకడుగు వేశారు.
Rice Mafia: అయితే, ఒకటో తేదీ నుంచి ఒక్కసారిగా ప్రజా బియ్యాన్ని పక్కదారి పట్టించే పని చేపట్టింది రైస్ మాఫియా. ఈ మాఫియా పెద్దలకు కేసులు పెట్టినా బెదురులేదు.. బియ్యం సీజ్ చేసినా అదురులేదు.. పీడీ యాక్ట్ పెడతామన్నా భయంలేదు.. ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ దందా ఆపేదే లేదు. ఎవరు అడ్డొచ్చినా తొక్కించుకుంటూ వెళతాం. మేము ప్రజా బియ్యాన్ని కొంటాం.. ఎవరు ఆపుతారో చూస్తాం. అనే పద్ధతిలో మాఫియా కోరలు చేస్తోంది. కానీ, ఇప్పుడు బియ్యం మాఫియా మళ్ళీ విజృంభిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూటు మార్చిన బియ్యం మాఫియా ఈసారి విశాఖపట్నం కేంద్రంగా తమ దందాను గట్టిగా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
Rice Mafia: బియ్యం మాఫియా పై తాజగా మహా న్యూస్ చేసిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకల్ గా ఒక మాఫియా.. ఎక్స్ పోర్ట్స్ ఒక మాఫియా.. ఇలా ప్రతి దశలోనూ ఒక్కో మాఫియా ఏర్పడింది. అంటే బియ్యం లోకల్ గా కొనుగోలు చేసేది ఒక మాఫియా. దానిని ఎక్స్ పోర్ట్స్ కి వీలుగా మార్చేది ఒక మాఫియా.. చివరిగా ఎక్స్ పోర్ట్ చేసేది మరో మాఫియా. గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ మాఫియా కింగ్ పింగ్ లుగా ఉన్నారో వారే ఇప్పుడూ కూడా ఈ దాష్టికానికి సూత్రధారులుగా ఉన్నారని తెలుస్తోంది. చిన్నస్థాయిలో అంటే.. లోకల్ స్థాయిలో 85 శాతం మంది పాతవారే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 15 శాతం టీడీపీ, జనసేనకి సంబంధించిన వారు చేతులు కలిపినట్టు తెలిసింది. అయితే, చివరగా ఎక్స్ పోర్ట్స్ విషయానికి వస్తే.. పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దందా నడిపారో.. మాఫియాగా మరి కోట్లాది రూపాయలను దోచుకున్నారో వాళ్ళే నూరు శాతం కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తగ్గామని అనుకుంటున్నారా.. బ్రేక్ ఇచ్చామంతే! మేం తగ్గేదేలే.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఈ రైస్ మాఫియా వ్యవహారం ఉంది. కాకినాడలో వీళ్ళ దందా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా మొత్తం ఈ మాఫియా కోరలు పీకేయాలని రంగంలోకి దిగడంతో కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా పూర్తిగా నిలిపేశారు. పోర్టులోకి వెళ్లే ప్రతి లారీని చెక్ పోస్టులు పెట్టి చెక్ చేసి బియ్యం రవాణా జరగకుండా ఉక్కుపాదం మోపి అణిచేశారు. అయితే, ఇప్పుడు ఈ మాఫియా కింగ్ పింగ్ లు తమ అడ్డాను విశాఖపట్నానికి మార్చేశారు. అప్పట్లో ఏ కంపెనీల పేరు మీద ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించేసే వారో వారే.. వారి కంపెనీల పేర్లు మార్చి వైజాగ్ లో కొత్త బోర్డులు పెట్టేశారు.
విస్తుపోయే విషయాలు..
Rice Mafia: గతంలో ఎవరైతే ఈ దందా చేశారో వాళ్ళ తెలివితేటలు అసలు మామూలుగా లేవు. మహా న్యూస్ పరిశీలనలో విస్తుపోయే అంశం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒక జిల్లాలో దందా చేసిన వారు ఇప్పుడు అక్కడ దానికి దూరంగా ఉన్నారు. అలా అని ఈ మాఫియా నుంచి పక్కకు జరిగి మంచిగా మారారు అనుకోకండి. వీళ్ళు వేరే జిల్లాలో దందా మొదలు పెట్టారు. ఆ జిల్లలో గతంలో చక్రం తిప్పిన వారు ఇంకో జిల్లాలో అంటే.. తమ నల్ల వ్యాపారాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారన్న మాట. కేవలం జిల్లా మారింది అంతే.. చేసేదంతా సేమ్ టు సేమ్. అదే పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనేయడం.. అడ్డగోలుగా విదేశాలకు ఎగుమతి చేసేయడం. దీనిలో ప్రజాప్రతినిధులకు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకూ ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు కావచ్చు.. వారి అనుచర గణం కావచ్చు.. మాట్లాడకుండా ఉండడం కోసం అదే పాత మాఫియా డబ్బులు ఇచ్చి తమ దందాను కొత్తగా నడిపించేస్తోందని అర్ధం అవుతోంది. ఈ విధంగా దాదాపు 50 శాతం దందాను నడిపిస్తున్నారని తేలింది. అయితే, మహా న్యూస్ కొంతమంది ప్రజాప్రతినిధులు.. వారి అనుచరులతో మాట్లాడితే మరింత విస్తుపోయే అంశాలు తెలిశాయి. మీరు తీసుకోకపోతే మీరే నష్టపోతారు. మీ పైవాళ్లకు ఇచ్చి మేము కథ నడిపిస్తాం. అంటూ సింపుల్ గా చెపేస్తున్నారు మాఫియా వీరులు. అంటే ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా దొంగ వ్యాపారం జరిగిపోతుందన్న మాట.
కేంద్రం బ్యాన్ ఎత్తివేసింది..
బ్రొకెన్ రైస్ (నూకల) ఎగుమతి పై కేంద్రం 2022 సెప్టెంబర్ లో నిషేదం విధించింది. ఫ్రీ నుంచి ప్రొహిబిటెడ్ లో చేర్చింది. ఆ సందర్భంలోనే పలు కంపెనీలు కోర్టు కు వెళ్ళి అప్పటికే నూకలు సేకరించామని ఎగుమతి ఆగిపోతే తీవ్ర నష్టం వస్తుందని చెప్పి అనుమతి పొంది ఎగుమతి చేశాయి. తరువాత 2023లో కేంద్రం నిషేధం విధించింది. అప్పుడు కాస్త తగ్గిన ఈ మాఫియా వ్యవహారాలు ఇటీవల నిషేధం ఎత్తేయడంతో ఒక్కసారిగా మళ్ళీ పెరిగిపోయాయి. ఎంతలా అంటే, ప్రభుత్వాన్నే సవాల్ చేసేంతగా. మేం దందా చేస్తాం.. ఎవరేం చేస్తారో చూస్తాం అనే పద్ధతిలో ఈ మాఫియా వ్యవహారం ఉంది.
విజిలెన్స్ ఏం చేస్తోంది?
ఇంతలా మాఫియా రెచ్చిపోతున్నా.. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి గతంలోనే సీరియస్ గా దీనికి అడ్డుకట్ట పడాల్సిందే. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు చేసిన ఈ దందా ఆగిపోవాల్సిందే అని చెప్పినా.. అధికారులు మరి కాసులకు కకక్కుర్తి పడుతున్నారో.. లేకపోతే మాఫియా బెదిరింపులకు భయపడుతున్నారో అర్ధం కానీ పరిస్థితి. ఇంత పెద్ద స్థాయిలో ఎగుమతులు జరిగిపోతున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడం ఆశ్చర్యమే.
ఒకసారి కాకినాడలో గతంలో సీజ్ చేసిన బియ్యం లెక్కలు చూద్దాం..
*కాకినాడ లో బియ్యం సీజ్…50,647 టన్నులు
- కాంకర్……9,246 టన్నులు
- ఎస్ ఆర్ జ్యోతి….9,280 టన్నులు
- హెచ్ గోడౌన్ …2,506 టన్నులు
- అశోక ఇంటర్నేషనల్….3,866 టన్నులు
- సార్టెక్స్ ఇండీ…136 టన్నులు
- సాయి తేజా షిప్పింగ్ సర్వీసెస్…1,437 టన్నులు
- విశ్వ ప్రియ ఎక్స్పోర్ట్…1,257 టన్నులు
- లవన్ ఇంటర్నేషనల్…4,531 ట్న్నులు
- అయ్యప్ప ఎక్స్పోర్ట్స్…1,699 టన్నులు
- శ్రీనివాస ట్రేడింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్…1,406 టన్నులు
- సరళ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్…3,723 టన్నులు
- బ్లూ ఓషన్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్…3,770 టన్నులు
- శ్రీ బాలాజీ రైస్ ఇండస్ట్రీ …7,784 టన్నులు
మొత్తం: 50,647 టన్నులు
అలాగే కాకినాడ పోర్ట్ నుంచి జరిగిన ఎగుమతుల వివరాలు ఇలా ఉన్నాయి..
* సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్: 21.25 లక్షల టన్నుల ఎగుమతి
* పట్టాభి ఆగ్రో Fఉడ్స్: 15.23 లక్షల టన్నులు
* ఓలం అగ్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: 10.54 లక్షల టన్నులు
* శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్: 7.29 లక్షల టన్నులు
* మానస ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ ఎంటర్ప్రైజెస్: 5.72 లక్షల టన్నులు
* సరళా ఫుడ్స్: 3.57 లక్షల టన్నులు
* బిబో ఇంటర్నేషనల్: 3.57 లక్షల టన్నులు
* బాలాజీ రైస్ ఇండస్ట్రీస్: 3.99 లక్షల టన్నులు
పాయింట్ వైజ్ ఈ బియ్యం ఎగుమతుల దందా ఎలా జరిగింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.
* జులై 2023 నాన్ బాసుమతి రైస్ స్వేచ్ఛా ఎగుమతి పై నిషేధం (హెచ్ ఎస్ కోడ్స్ 1006 30 90)
స్వేచ్ఛా ఎగుమతి నుంచి నిషేధిత జాబితాలోకి మార్పు
* సెప్టెంబర్ 28, 2024…నాన్ బాసుమతి తెల్ల బియ్యం ఎగుమతికి అవకాశం
నిషేదిత జాబితాలో నుంచి స్వేచ్ఛా ఎగుమతిలోకి నాన్ బాసుమతి రైస్(హెచ్ ఎస్ కోడ్ 1006 30 90)
కనీస అమ్మకం ధర టన్నుకు 490 అమెరికన్ డాలర్లు ఉండాలి
* 2023 జులై లో నాన్ బాసుమతి రైస్ ఎగుమతి పైన నిషేధం విధించిన నేపధ్యంలో 2024-25 లో ప్రైవేట్ కంపెనీలు రా రైస్, బ్రోకెన్ రైస్ ను ఎగుమతి చేయలేదు
బాయిల్డ్ రైస్ ను మాత్రం ఎగుమతి చేశాయి
2024-25 లో రా రైస్ (38,675 టన్నులు), బ్రోకెన్ రైస్ (1,45,200 టన్నులు) ను నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేయగలిగింది.
* కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి కి రెక్కలు వచ్చాయి
కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 2019-20 నుంచి ఇప్పటి వరకూ 1.40 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది. ఇందులో రా రైస్, బాయిల్డ్ రైస్, బ్రోకెన్ రైస్ ఉన్నాయి.
* 2019-20 తో పోలిస్తే (11.49 లక్షల టన్నులు) 2020-21 లో రెట్టింపు (27.85 లక్షల టన్నుల) ఎగుమతి జరిగింది.
బాయిల్డ్ రైస్ ఎగుమతిలో కొద్దిగానే పెరుగుదల ఉన్నా రా రైస్ (1.59 లక్షల టన్నుల నుంచి 9.15 లక్షల టన్నులు), బ్రొకెన్ రైస్ (2.12 లక్షల టన్నుల నుంచి 6.04 లక్షల టన్నులు) పెరుగుదల అనూహ్యంగా ఉంది.
* 2020 లో పెరిగిన ఎగుమతుల పెరుగుదల 2023 జులై లో కేంద్రం నిషేదం విధించే వరకూ కొనసాగుతూ వచ్చింది.
* కొన్ని కంపెనీలు ఇంతై వటుడింతై అన్నట్లు ఎగుమతులను పెంచుకుంటూ వెళ్ళాయి
** 2019-20 నుంచి 2023-24 వరకూ రా రైస్, బ్రొకెన్ రైస్ ఎగుమతిలో కంపెనీలు పోటీ పడ్డాయి.
విమర్శల చట్రంలో చిక్కుకున్న మానస ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ ఎంటర్ప్రైజ్ 1.93 లక్షల టన్నుల రా రైస్, 1.51 లక్షల టన్నుల బ్రొకెన్ రైస్ ను ఎగుమతి చేసింది. వీటితో పాటు బాయిల్డ్ రైస్ తో కలిపి 5.72 లక్షల టన్నుల బియ్యం మానస ఎగుమతి చేసింది.
* సరళా ఫుడ్స్
మూడేళ్ళల్లో 3.57 లక్షల టన్నుల బియ్యం (రా, బాయిల్డ్, బ్రొకెన్) ఎగుమతి చేసింది.
* పట్టాభి ఆగ్రో ఫుడ్స్ రికార్డ్ స్థాయిలో ఎగుమతి
రా రైస్, బాయిల్డ్ రైస్, బ్రొకెన్ రైస్ కలిపి 2019-20 నుంచి ఇప్పటి వరకూ 15.23 లక్షల టన్నుల ఎగుమతి చేసింది.
అయితే ఇందులో 10.71 లక్షల టన్నుల బాయిల్డ్ రైసే ఉంది.