OTT Highest Digital Rights

OTT Highest Digital Rights: OTT ఎక్కువ రేట్ కి కొన్న సినిమాలు ఇవే.. ఏది NO.1 అంటే..?

OTT Highest Digital Rights: ఈరోజుల్లో సినిమా థియేటర్లలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానికంటే ఓటీటీ(OTT)లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆసక్తి జనాల్లో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. రెండింటికీ ఒకే రకమైన రియాక్షన్ ఇస్తున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇపుడు ఉన్న టికెట్ ప్రైస్ తో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోని అందులో నచ్చినని సినిమాలు చూడొచ్చు అని అనుకుంటున్నారు. దింతో  థియేటర్‌ కంటే ఓటీటీ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్ లు కూడా పెరుతున్న డిమాండ్ మేరకు పోటా పోటీగా థియేటర్‌ లో సినిమా వచ్చిన  కొద్దిరోజులోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఓటీటీ లో అత్యధికంగా అమ్ముడైన సినిమాలు ఏవి? ఏ సినిమాని ఎన్ని కోట్లకు కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

SRK's Pathan first movie to release in Bangladesh — The Kashmir Monitor

ఓటీటీలో అత్యధికంగా అమ్ముడైన సినిమా జాబితాలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ 8వ స్థానంలో నిలిచింది.ఈ సినిమాని సిద్ధార్థ్ ఆనంద్ దర్సకత్వం వహించారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటించిన ఈ సినిమా థియేటర్‌ లో రిలీజ్ అయి 1050 కోట్లు వసూలు సాధించింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని 100 కోట్లకు కొనుకుంది. 

Watch Leo (Hindi) | Netflix

ఈ లిస్ట్‌లో దళపతి విజయ్ సినిమా కూడా ఉంది.. విజయ్, త్రిష జంటగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని  రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది.

Salaar Review: A Riveting Tale of Power and Brotherhood in a Dystopian  World | Salaar Movie Review

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో హిట్ సినిమా  సాలార్. కేజీఎఫ్ లుక్‌లో వచ్చిన ఈ సినిమా  కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని 162 కోట్లకు కొనుకుంది. దింతో సాలార్ 6వ స్థానంని దక్కించుకుంది. 

Shah Rukh Khan drops thrilling new 'Jawan' promo ahead of its Japan release  | WATCH, new jawan promo, shah rukh khan, jawan, Bollywood, Japan, Release  Date, Nayanthara, deepika

ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ జవాన్ 5వ స్థానంలో ఉంది. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై 1000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాని 250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

Pushpa 2: The Rule' poster unveiled with Allu Arjun's menacing look, teaser  tomorrow | Mint

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఇటీవలే రిలీజ్ అయింది. మొదటి భాగం సూపర్ హిట్ కాగా, రెండవ భాగం భారీ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ OTT ఈ సినిమాని 275 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

KGF Chapter 2: కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఎట్టకేలకు సినిమా  ట్రైలర్‌ వచ్చేస్తోంది.! - Telugu News | KGF movie unit planning to release  KGF Chapter 2 trailer soon | TV9 Telugu

పాన్ ఇండియాగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రం కేజీఈఎఫ్-2, 3వ స్థానంలో, యష్ నటించిన థియేటర్లో విడుదలైన ఈ సూపర్ హిట్ సినిమా 1000 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని రూ.320 కోట్లకు కొనుగోలు చేసింది.

RRR 2 Big Update: Ram Charan and Jr NTR Starrer To Be Shot In Africa, Work  On Script Underway - News18

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా  ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం OTTలో 350 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ చిత్రం హాట్ స్టార్‌లో నెట్‌ఫ్లిక్స్ ,డిస్నీ ప్లస్‌లో కూడా అందుబాటులో ఉంది.

Prabhas, Deepika Padukone-starrer Kalki 2898 AD is set to premiere on Prime  Video - About Amazon India

కల్కి 2898 AD ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అనేక ఇతర ప్రముఖ ప్రముఖులు నటించిన మెగా చిత్రం. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొంది రూ.1000 కోట్ల మార్కును దాటేసింది. థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా విడుదల అయి అక్కడ కూడా భారీ స్పందనను అందుకుంది. దీని ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని రూ.200 కోట్లకు, నెట్‌ఫ్లిక్స్ రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ జాబితాలో రూ.375 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

షార్ట్ లిస్ట్..

1)కల్కి 2898 AD.. 375 కోట్లు-  అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్

2)RRR..   350 కోట్లు-హాట్ స్టార్‌,నెట్‌ఫ్లిక్స్ ,డిస్నీ ప్లస్‌

3)కేజీఈఎఫ్-2..  320 కోట్లు అమెజాన్ ప్రైమ్ 

4)పుష్ప-2.. 275 కోట్లు నెట్‌ఫ్లిక్స్ 

5)జవాన్.. 250 కోట్లు నెట్‌ఫ్లిక్స్ 

6)సాలార్.. 162 కోట్లు నెట్‌ఫ్లిక్స్ 

7)లియో.. 120 కోట్లు నెట్‌ఫ్లిక్స్ 

8)పఠాన్.. 100 కోట్లు అమెజాన్ ప్రైమ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *