Ap news: ఆంధ్రప్రదేశ్ లోని, అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హనుమంతు (50), రమణ (30) తీవ్ర గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడినవారు పాత సామానుల వ్యాపారం చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.