Rangareddy

Rangareddy: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో దారుణ ఘటన

Rangareddy: వీడు ఒక పెద్ద పాతుత్తి. పాపం చాలా మంచోడు అంట. అందుకోసమే కట్టుకున్న భార్యను చంపేశాడు. చంపి..నేను భార్యను చంపేసాను అని చుట్టుపక్కల చాటింపు చేసాడు. ఇంతకీ ఈ పనికిమాలిన వాడు ఎందుకు కట్టుకున్న భార్య ప్రాణం తీసాడు. ? అనుమానం అనే రోగం ఒక్కటి ఉంటుంది కదా ఆ రోగంతో..ఈ రాక్షసత్వానికి పాల్పడ్డాడు. ఘనకార్యం చేసినట్లు పోలీసుల వద్దకు వెళ్లి …నేను భార్యను చంపాను అని ఒప్పేసుకున్నాడు.

రంగారెడ్డి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కోకాపేట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరచి అతి క్రూరంగా కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త.. పిల్లలు ఏమైపోతారోననే కనీస ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా చంపైశాడు ఓ సైకో తాగుబోతు భర్త..

Rangareddy: కోకాపేట్‌లో నివసిస్తున్న ముత్యాలు.. తన భార్య సునీతను గొంతు నులిమి హతమార్చాడు. ఇంట్లో భార్యను చంపి బయటి నుంచి తలుపులు వేశాడు హంతకుడు.. ఆ తర్వాత తన భార్యను చంపానంటూ కాలనీ వాసులకు చెప్పి.. నార్సింగీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు,.

తాగుడుకు బానిసైన ముత్యాలు భార్యపై అనుమానంతో తరచూ వేధిస్తుండేవాడు. డబ్బులు కావాలంటూ తరచూ గొడవ పడేవాడు. తప్పతాగి వచ్చి రాత్రుల్లో భార్యపై దాడికి దిగేవాడు. నాలుగు నెలల క్రితం భార్య మర్మాంగాలలో కీర దోసకాయ పెట్టిన అత్యంత రాక్షసంగా, కిరాతకంగా వ్యవహరించాడు.

Rangareddy: అలాగే 6 నెలల క్రితం పాశవికంగా దాడి చేయడంతో సునీత ఆస్పత్రి పాలైనట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసిన ప్రతిసారి విషయం బయటకు పొక్కకుండా సైకో భర్త జాగ్రత్త పడేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్తింగ్ ఇచ్చేవాడు.

చివరికి అన్నంతపని చేశాడు ఈ కసాయి భర్త.. భార్యను హత్యచేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సైకో ముత్యాలుకు సునీత రెండోవ భార్య.. వేధింపులు భరించలేక మొదటి భార్య ముత్యాలును వదిలి పారిపోయింది. రెండో భార్య సునీత పిల్లల కోసం ముత్యాలు అగాయిత్యాలను భరిస్తూ వచ్చినప్పటికీ..చివరికి కసాయి చేతిలో దారుణంగా హత్యకు గురై చనిపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య వ‌దిలేసి వెళ్లింద‌ని మ‌న‌స్తాపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *